
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలకృష అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమా మాత్రమే కాదు అంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు కూడా సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇక అఖండ సినిమా తర్వాత ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
తాజాగా అఖండ 2 నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. నిన్న (శుక్రవారం ) అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. ఇతర హీరోలకు తనకు ఎలాంటి పోటీ లేదన్న బాలయ్య. కొంతమంది హీరోలు అసలు సెట్స్ కు రారు. గ్రీన్ మ్యాట్ లో, బ్లూ మ్యాట్ లో షూటింగ్ చేసేస్తుంటారు. కానీ నేను ఒరిజినల్ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దాంతో ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బాలయ్య అభిమానులు మాత్రం బాలకృష్ణ చెప్పింది నిజమే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్యబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చిన్న పాటి దుమారాన్నే రేపాయి. మరి దీని పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక అఖండ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు, సంయుక్తమీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.