Happy Birthday NBK: రికార్డులైనా.. కలెక్షన్స్ అయినా బాలయ్య దిగనంతవరకే .. జై బాలయ్య

ఆయన తెర పై కనిపిస్తే సంచనలం.. ఆయన సినిమా అంటే ప్రభంజనం.. మాస్ అయినా.. క్లాస్ అయినా ఏవర్గం అయినా ఆయన నటనకు ఫిదా అవ్వాల్సిందే.

Happy Birthday NBK: రికార్డులైనా.. కలెక్షన్స్ అయినా బాలయ్య దిగనంతవరకే .. జై బాలయ్య
Balakrishna

Updated on: Jun 10, 2022 | 12:36 PM

ఆయన తెర పై కనిపిస్తే సంచనలం.. ఆయన సినిమా అంటే ప్రభంజనం.. మాస్ అయినా.. క్లాస్ అయినా ఏవర్గం అయినా బాలయ్య నటనకు ఫిదా అవ్వాల్సిందే.. ఆయనకు అభిమాని కావాల్సిందే. తెర పై  ఆయన డైలాగ్ చెప్పారంటే అడవిలో సింహం గర్జించినట్టే.. అందుకే ఆయననను నట సింహం అంటారు.. ఆయనే నందమూరి బాలకృష్ణ(Nandamuri BalaKrishna). ఫ్యాన్స్ బాలకృష్ణను అభిమానంతో బాలయ్య పిలుస్తుంటారు. ఈ రోజు ఈ నట సింహం పుట్టిన రోజు.. నేటితో బాలయ్య 62వ వసంతంలోకి అడుగు పెట్టారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా సినిమా తారలు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి ఏటా బాలయ్య పుట్టిన రోజును అభిమానులు పండగలా జరుపుకుంటారు. బాలయ్య పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. సినిమా పోస్టర్లు, కామన్ డీపీలతో మోతమోగిస్తున్నారు.

సినీ, రాజకీయంగా బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్ సినిమాలకు, ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. సమరసింహారెడ్డి విజృంభించిన తీరుకు టాలీవుడ్ షాక్ అయింది. అలా బాలయ్య బాక్సాఫీస్ పోరులో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఇక బోయపాటి తెరకెక్కించిన సింహ సినిమానుంచి బాలయ్య వేట మొదలయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు. రీసెంట్ గా అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు బాలయ్య. అలాగే రికార్డులు, కలెక్షన్స్ మొత్తం తిరగరాసింది అఖండ. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య కెరీర్ లో 107 సినిమా గా వస్తుంది ఇది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఎన్బీకే 107 నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి :