పాన్ ఇండియా ఇమేజ్ కోసం నేనెప్పుడూ పాకులాడలేదు అని ఓపెన్ గా చెప్పినప్పటికీ నాగార్జునకు… ఇప్పుడు నేషనల్ వైడ్ అప్లాజ్ వస్తోంది. నాగ్ లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్.. నెట్ ఫ్లిక్స్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తోందన్నది డిజిటల్ ఎనలిస్టులు చెబుతున్న బ్రేకింగ్ న్యూస్.
కోవిడ్ కారణంగా కొన్ని వారాల్లోనే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న నాగ్ మూవీ వైల్డ్ డాగ్.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సత్తా చాటుతోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో… రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించి ఫిదా చేస్తున్నారు నాగ్. సోలొమన్ టేకింగ్ రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వైల్డ్ డాగ్ మూవీని ఇంకాస్త బలంగా నిలబెట్టింది. ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు.
పాన్ ఇండియా అప్పీల్ వున్న కంటెంట్ కావడం కూడా వైల్డ్ డాగ్ కి అడ్వాంటేజ్ అయింది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో డిజిటల్ ఆడియెన్స్ ఓన్ చేసుకోవడంతో… రిలీజైన రెండు రోజుల్లోనే మిలియన్స్ అఫ్ వ్యూస్ తో సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది వైల్డ్ డాగ్. తమిళ్ వెర్షన్ అయితే నేషన్ వైడ్ ట్రెండింగ్ లో ఫిఫ్త్ పొజిషన్ ఆక్యుపై చేసిందని గర్వంగా ప్రకటిస్తోంది నెట్ ఫ్లిక్స్.
Also Read: పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్