
డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మూవీ సూపర్. ఈ సినిమాలో నాగార్జున లుక్ అదిరే లెవల్‌లో ఉంటగుంది. ఇక ఈ మూవీతోనే అనుష్క శెట్టి కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ అయేషా టకియా కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అలరించలేకపోయింది. అయితే ఈ సినిమాలో అయేషా టకియా తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. బబ్లీ లుక్స్‌తో మెంటల్ ఎక్కిచ్చింది. ఆయేషా టకియా అంటే గుర్తుపడతారో లేదో కానీ ‘సూపర్’ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే కనిపెడతారు. అయితే సూపర్ సినిమా తర్వాత అయేషా మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్‌లో ‘టార్జాన్: ద వండర్ కార్’ సినిమాతో ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ‘సోచా న థా’, ‘సలామ్ ఇ ఇష్క్’, ‘వాంటెడ్’, ‘పాఠశాల’ వంటి పలు హిట్ చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్‌లో వీక్ అయి.. ప్లాఫ్స్ బాట పట్టింది. అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. మ్యారేజ్ అనంతరం ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరు చివరన అజ్మీ అన్న పదాన్ని చేర్చింది.
అయితే అయేషా టకియా శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించింది. నేవీ బ్లూ కలర్ సల్వార్ కమీజ్‌లో కనిపించిన అయేషా ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఎగబడ్డారు. ఆ సమయంలో అయేషా కుమారుడు మైఖేల్ కూడా పక్కనే ఉన్నాడు. ఆమె లేటెస్ట్ వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, అయేషా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. “చాలా కాలం తర్వాత ఆమెను చూడటం ఆనందంగా ఉంది” అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ఆమె మరింత బబ్లీగా మారిందని మరొకరు పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.