Tollywood: బ్రహ్మ కుమారిగా మారిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పుడు తెలుగు, హిందీ భాషా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంంతో ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడీ అందాల తార ఆధ్యాత్మిక బాట పట్టింది.

Tollywood: బ్రహ్మ కుమారిగా మారిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Jun 05, 2025 | 2:43 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. పంజాబీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ మెరిసింది. తెలుగులో అయితే అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, శ్రీకాంత్, అబ్బాస్, ఆకాష్, అర్జున్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక బాలీవుడ్ లో అయితే ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. తన సినిమా కెరీర్ లో 30 కు పైగా సినిమాల్లో నటించిన ఈ అందాల తార కొన్ని సీరియల్స్ లోనూ నటించింది. ఈ నటి శిక్షణ పొందిన భరతనాట్యం, ఒడిస్సీ నర్తకి కూడా . కాగా గత పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోందీ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడామె ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తోంది. బ్రహ్మ కుమారీ గా మారి ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ నటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? ఆమె మరెవరో కాదు సంతోషం సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన హీరోయిన్ గ్రేసీ సింగ్.

సంతోషం తర్వాత తప్పుచేసి పప్పుకూడు, రామ రామకృష్ణ కృష్ణ, రామ్ దేవ్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది గ్రేసీ సింగ్. ఇక హిందీలో అయితే ‘లగాన్’, ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. అయితే గ్రేసీ సింగ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఆధ్యాత్మిక శాంతిని వెతుక్కుంటూ, గ్రేసీ సింగ్ బ్రహ్మ కుమారీస్ సంస్థలో చేరింది. ఆమె ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ధ్యానం, యోగా, సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేస్తోంది.బ్రహ్మ కుమారీస్‌లో చేరిన తర్వాత, గ్రేసీ ఒక పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నేను అపారమైన ఆనందం, శాంతిని పొందుతున్నాను’ అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజి బిజీగా..


గ్రేసీ శిక్షణ పొందిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి. ఇప్పుడు బ్రహ్మ కుమారీస్ కార్యక్రమాల్లో కూడా తన నృత్యం ద్వారా ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది. గ్రేసీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఆమెకు 44 సంవత్సరాలు, ఆమె తన జీవితాన్ని ఇలాగే గడపడానికి ఇష్టపడుతుంది. గ్రేసీ చివరిగా సంతోషి మా సీరియల్ సీక్వెల్ ‘సంతోషి మా- సునేన్ వ్రత్ కథేన్’లో ఒక పాత్ర పోషించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..