Pawan Kalyan: పవన్- సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్‌గా నాగార్జున మూవీ సాంగ్

|

Apr 29, 2023 | 6:55 AM

ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయసిత్తం అనే సినిమాకు ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది.

Pawan Kalyan: పవన్- సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్‌గా నాగార్జున మూవీ సాంగ్
Pawan Kalyan, Sai Dharam Te
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన వాటిలో సముద్రఖని డైరక్షన్ లో చేస్తోన్న సినిమా ఒకటి. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆడిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయసిత్తం అనే సినిమాకు ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్ పై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కన్ఫామ్ చేసారని టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది. కానీ ఈ టైటిల్ విషయంలో నిజం లేదని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి కింగ్ నాగార్జున సూపర్ హిట్ సాంగ్ టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ మూవీకి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కింగ్ నాగార్జున నటించిన సంతోషం సినిమాలోని సాంగ్ ఇది.

ఒక సామాన్యుడి కోసం దేవుడు దిగివస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. త్రివిక్రమ్ సంభాషణలు రాస్తున్నారు.స్క్రీన్ ప్లేని కూడా అందిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. జూలై 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.