రజినీకాంత్ సినిమాకోసం నాగార్జున అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడా..!!

కొంతకాలం క్రితం ఈ చిత్రానికి సంబంధించిన 3 నిమిషాల ప్రకటన వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో రజనీకాంత్ ఫుల్ స్టైల్‌గా కనిపించారు. ఈమూవీ బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు.

రజినీకాంత్ సినిమాకోసం నాగార్జున అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడా..!!
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2024 | 1:48 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైనప్ చేశారు. రజినీకాంత్ నటించిన వేటయన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు సూర్య హీరోగా నటించిన కంగువ కూడా రిలీజ్ కానుంది. రెండు సినిమాలు క్లాష్ అవ్వకుండా..కంగువ సినిమాని వాయిదా వేశారు సూర్య. ఇక వేటయన్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో సినిమాను లైనప్ చేశారు సూపర్ స్టార్. జూలై 5న హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆసినిమానే కూలీ.

కొంతకాలం క్రితం ఈ చిత్రానికి సంబంధించిన 3 నిమిషాల ప్రకటన వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో రజనీకాంత్ ఫుల్ స్టైల్‌గా కనిపించారు. ఈమూవీ బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, కన్నడ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షాహీర్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో దేవా పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. సైమన్ అనే పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నాగార్జున పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన లుక్ ను విడుదల చేశారు.

కూలీ కోసం రజనీకాంత్ 260-280 కోట్ల రూపాయల ఫీజు తీసుకున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే, మేకర్స్ దీని పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాగార్జున రూ. 24 కోట్లు అందుకుంటున్నారని కూడా టాక్ వినిపించింది. సైమన్ అనే డాన్ పాత్రలో నటిస్తున్నాడు నాగ్. ఈ సినిమాలో వీరిద్దరూ కలసి నటించడం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో రజనీకాంత్ లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించారు.  ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు కూలీ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి