యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నారు చైతూ. ఈ క్రమంలోనే సమంతతో వివాహం, విడాకుల గురించి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఇటీవల తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంత, సాయిపల్లవితో బాగుంటుందని చెప్పిన చైతూ.. ఇక ఇప్పుడు సామ్ కు తనకు మధ్య అపారమైన గౌరవముందని చెప్పుకొచ్చారు.
వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితాన్ని కలిసి నిర్వహించడం నేర్చుకున్నారా ? అని ఓ విలేకరి అడగ్గా.. చైతూ చిరునవ్వుతో రిప్లై ఇచ్చాడు. నేను అదే చేస్తాను కాబట్టి ప్రస్తుతం ఇలా ఉన్నాను. వ్యక్తిగత జీవితానికి.. వృత్తిపరమైన జీవితానికి ఒక స్పష్టమైన రేఖను గీయాలి. చిత్తశుద్దితో చేసే పని మనల్ని ఎప్పుడూ బాగుపరుస్తుందని అనుకుంటాను. వార్తలను వార్తలే భర్తీ చేస్తాయి. ఇవాళ ఒకటి. రేపు మరొకటి. అందుకే మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాలి. మీ సినిమాలతో ప్రజలను అలరిస్తే.. అది మిమ్మల్ని మరింత ప్రకాశించేలా చేస్తుంది అని చెప్పుకొచ్చారు.
విడాకులు తీసుకున్న తర్వాత తనపై.. సమంత గురించి వస్తున్న వార్తలపై చైతూ స్పందించాడు. మేమిద్దరం మా స్టేట్మెంట్స్ ఇచ్చాము. మాకు ఒకరిపై మరొకరికి అమితమైన గౌరవం ఉంది. ఎప్పుడూ ఆమె పై గొప్ప గౌరవం ఉంది. మా గురించి మేము మా వద్ద ఉన్నదే చెప్పాము. కానీ అంతకుముంచి మా మధ్య ఉన్నదాన్ని పూరించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. మా గురించి వస్తున్న వార్తలు చూసి విసుగు చెందాను అని అన్నారు. నాలుగేళ్ల వివాహ బంధానికి గతేడాది అక్టోబర్ 2న ముగింపు పలికారు చైతూ సామ్. తామిద్దరం విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.