Thandel: రిలీజ్‌కు ముందే రికార్డ్.. భారీ ధరకు అమ్ముడుపోయిన తండేల్ ఓటీటీ రైట్స్

|

Apr 29, 2024 | 7:35 PM

నాగ చైతన్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. చైతు నుంచి సాలిడ్ హిట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నాగ చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

Thandel: రిలీజ్‌కు ముందే రికార్డ్.. భారీ ధరకు అమ్ముడుపోయిన తండేల్ ఓటీటీ రైట్స్
Thandel
Follow us on

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. చైతు నుంచి సాలిడ్ హిట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నాగ చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో డీల్ చేసి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ తండేల్ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిందని టాక్.  నాగ చైతన్య ‘తాండల్’ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో 40 కోట్లకు డీల్ జరిగిందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా విడుదలకు ముందే 40 కోట్లు రాబట్టింది.

ఈ సినిమా హక్కులు అమ్ముడుపోవడం ఓ రికార్డ్‌గా మారింది. చైతు కెరీర్ లో ఇంత భారీ ధరకు రైట్స్ అమ్ముడుపోయిన సినిమా ఇదే.  నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల్లో సినిమా హక్కులను కొనుగోలు చేసింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అన్ని భాషల్లో ‘తాండల్‌’ సినిమా హక్కుల కోసం డీల్‌ కుదిరిందని తెలుస్తోంది.

శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో నాగ చైతన్య మత్స్యకారుడిగా కకనిపించనున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. సాయి పల్లవి చివరిగా 2022లో ‘గార్గి’ సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.