టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన ఇప్పటికీ అభిమానులకు షాకింగ్ వార్తే. చాలాకాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికిగల కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఇద్దరు మనస్పర్థల కారణంగానే విడిపోయారని గతంలో పలు సామ్ మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ తమ డివోర్స్ గురించి ఇప్పటివరకు చైతూ స్పందించలేదు. అయితే ఇప్పుడు చైతన్యకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో రిలేషన్ షిప్ లో మోసపోయానని.. అలాగే మోసం చేశానని అన్నారు చైతూ.
2018లో నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు రిలేషన్ షిప్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అనే టాస్కులో భాగంగా చైతూ పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. ఎప్పుడైనా రిలేషన్ షిప్ లో మోసం చేశారా అని అడగ్గా.. అవును అంటూ చెప్పుకొచ్చాడు చైతూ. ప్రతి ఒక్కరూ జీవితంలో అన్నీ అనుభవించాలని.. అప్పుడు నువ్వు ఎదుగుతావని హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో అన్నారు చైతూ. తానూ ప్రతిదీ అనుభవించానని.. ఇప్పుడు సెటిల్ అయ్యే సమయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియోనూ నెట్టింట షేర్ చేస్తున్నారు.
అందులో చైతూ చెప్పిన సమాదానం విని.. సమంతను చైతూ మోసం చేశాడా ?.. అందుకే ఆ విషయం ముందే ఒప్పుకున్నాడా ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చైతన్య నుంచి ఇలాంటి ఆన్సర్ ఊహించలేదని.. తను జీవితంలో ఎదురయ్యే క్షణాలను చెప్పాడంటూ మద్దతు తెలుపుతున్నారు. ఏమాయ చేసావే సినిమాలో చైతూ, సమంత కలిసి నటించారు. వీరిద్దరు 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత 2024లో విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లుగా చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
Naga Chaitanya admits to Cheating in the past, says “Everyone should experience everything!”
byu/Significant-Neat-142 inBollyBlindsNGossip
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.