Naga Babu Konidela: ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో సినిమా పెద్దలు ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ ధరలు పెంచాలంటూ నిర్మాతలు అంటుంటే.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ధరలను తగ్గించామని ప్రభుత్వం చెప్తుంది. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఏపీ మంత్రులు చెప్తున్నా మాట. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రులు మైకులు పెట్టి మొత్తుకుంటున్నారు. అయితే సినిమా టికెట్ ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇక ఈ వ్యవహారం పై ఇప్పటికే సినీ పెద్దలకు ఏపీ మంత్రులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ విషయం పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఇప్పటికే టీవీ 9వేదికగా ఏపీ మంత్రి పేర్ని నానితో మాటల యుద్దానికి దిగిన ఆర్జీవీ. ఇప్పుడు తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తనకు ఉన్న పది ప్రశ్నలను ప్రభుత్వం పై సంధించారు ఆర్జీవీ.
My 10 questions to all concerned with the ticket rates issue in the honourable AP government https://t.co/EJH1CKYsQW
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
You’re absolutely right… And you took the questions right out of my mouth… @RGVzoomin https://t.co/OcePNWtnNj
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 4, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :