లుక్ అదిరింది ‘నారప్ప’..హిట్ కూడా అట్టాగే ఉంటదా..?

|

Jan 22, 2020 | 5:55 PM

టాలీవుడ్‌‌లో ఏమైనా కొత్తగా ట్రై చెయ్యాలంటే దగ్గుబాాటి హీరో వెంకటేశ్ ముందుంటారు. క్యారెక్టర్ పరంగా గానీ, కథల పరంగా గానీ ఆయన చేసిన ప్రయోగాలను ప్రేక్షకులు కూడా ఆదరించారు. జోనర్ ఏదైనా జీవించేయడం వెంకీకి అలవాటు. ఇక ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాలు అయితే ఆయన చెలరేగిపోతారు. తాజాగా ఆయన మరో ప్రయోగానికి సిద్దమయ్యారు. ‘నారప్ప’ అనే పక్కా మాస్ రోల్‌లో ప్రేక్షకులను పలుకరించబోతున్నారు. తమిళ్‌లో సూపర్ హిట్ ఐన ‘అసురన్’  మూవీకు ‘నారప్ప’ రీమేక్. తన లాస్ట్ మూవీ […]

లుక్ అదిరింది ‘నారప్ప’..హిట్ కూడా అట్టాగే ఉంటదా..?
Follow us on

టాలీవుడ్‌‌లో ఏమైనా కొత్తగా ట్రై చెయ్యాలంటే దగ్గుబాాటి హీరో వెంకటేశ్ ముందుంటారు. క్యారెక్టర్ పరంగా గానీ, కథల పరంగా గానీ ఆయన చేసిన ప్రయోగాలను ప్రేక్షకులు కూడా ఆదరించారు. జోనర్ ఏదైనా జీవించేయడం వెంకీకి అలవాటు. ఇక ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాలు అయితే ఆయన చెలరేగిపోతారు. తాజాగా ఆయన మరో ప్రయోగానికి సిద్దమయ్యారు. ‘నారప్ప’ అనే పక్కా మాస్ రోల్‌లో ప్రేక్షకులను పలుకరించబోతున్నారు. తమిళ్‌లో సూపర్ హిట్ ఐన ‘అసురన్’  మూవీకు ‘నారప్ప’ రీమేక్. తన లాస్ట్ మూవీ వెంకీ మామలో మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తిగా కనిపించిన వెంకీ, ఇప్పుడు ఊర మాస్ గెటప్‌లోకి మారిపోయారు. ప్రజంట్ ఆయన ‘నారప్ప’ ఫస్ట్ ‌లుక్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. వెంకీ లుక్ చూసి ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, ఇండస్ట్రీ అంతా ఆశ్యర్యపడింది. అంతగా ఆయన గెటప్‌తో సర్‌ప్రైజ్ చేశారు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో  ‘నారప్ప’ మూవీ తెరకెక్కుంది.  షూటింగ్‌ను బుధవారం.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం వెంకీపై ఫస్ట్ సీన్‌ను షూట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్‌ అంతా రాయలసీమలోనే జరగనుంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా… డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.