RGV: రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. ఈసారి బయోపిక్ కాకుండా రియల్ పిక్.. అది కూడా 2 పార్ట్స్

|

Oct 27, 2022 | 4:48 PM

మరోసారి పొలిటికల్ సీన్‌లోకి ఎంటరయ్యారు వర్మ. సీఎం జగన్‌ను కలిసి రెండు రోజులు గడవకుండానే రియల్ పిక్ అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అది కూడా రెండు పార్ట్స్‌గా రానుందట.

RGV: రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. ఈసారి బయోపిక్ కాకుండా రియల్ పిక్.. అది కూడా 2 పార్ట్స్
Film Director Ram Gopal Varma
Follow us on

క్రేజీ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. అడపాదడపా రాజకీయ ప్రాధాన్యమున్న సినిమాలు తీస్తూ.. సంచలనాలు సృష్టించే వర్మ… ఈసారి ఆ డోస్ మరింతగా పెంచేస్తూ మరో సినిమా అనౌన్స్ చేశారు. మూవీ పేరు వ్యూహం. ఏంటి మేస్టారూ… ఇది కూడా బయోపిక్కేనా అని అడక్కముందే… కాదుకాదు అంతకుమించి అంటూ తనదైన స్టయిల్‌లో ఆన్సరిచ్చేశారు. తన వ్యూహం సినిమా రెండు పార్టులుగా రాబోతోందని, దీనికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చారు వర్మ. బయోపిక్‌లో అయినా అబద్దాలుండొచ్చు… రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళూ నిజాలే ఉంటాయంటున్నారు వర్మ. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిందే ఈ “వ్యూహం” కధ అంటున్నారు. గతంతో తాను తీసిన వంగవీటి మూవీ నిర్మించిన దాసరి కిరణ్ అనే వ్యక్తే దీనికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారన్నారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. తాను దాని గురించి ఏం చెప్పట్లేదు అన్నారు వర్మ.

వ్యూహం సినిమాతో పొలిటికల్ షాక్‌ తప్పదని, దాన్నుంచి తేరుకునే లోపే శపధం అనే సినిమాతో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తానన్నారు వర్మ. ఏపీ సీఎం జగన్‌తో భేటీ తర్వాత… వర్మ ఈ ప్రకటన చేయడంతో ఈ రెండు సినిమాలు ఎవరిని టార్గెట్‌గా చేసుకుని తీస్తారు అనే చర్చ షురూ అయింది. ఇప్పటికే… చంద్రబాబు, వంగవీటి రంగా, పరిటాల రవి, లక్ష్మీపార్వతి, పవన్‌కల్యాణ్‌ సెంట్రిక్‌గా పొలిటికల్ సినిమాలు చేసి ఏపీ పాలిటిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ.

వర్మ ఏది చేసినా సెన్సేషనే.  సినిమా కోసం.. దాని ప్రమోషన్ కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంతదూరమైనా వెళ్తారు. జడ్జ్ చేయలేని ఓ టిపికల్ క్యారెక్టర్ ఆయనది. మరి ఈ సినిమా ద్వారా ఆర్జీవీ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు..? రియల్ పిక్ అంటున్నారు కాబట్టి.. ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ టచ్ చేస్తారు అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..