
ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవికి విడాకులు మంజూరయ్యాయి. ఈమేరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 30) తీర్పునిచ్చింది. జీవీ ప్రకాశ్- సైంధవీలది ప్రేమ వివాహం. ఇద్దరికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. అదే అనుబంధంతో 2013లో పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2020వ సంవత్సరంలో కూతురు అన్వి జన్మించింది. 12 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన జీవీ ప్రకాశ్ కుమార్- సైంధవి గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మేము తీసుకున్న ఈ విడాకుల నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తరువాతనే తీసుకున్నాం. ఇలాంటి సమయంలో మా గోపత్యకు భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాం. ‘అంటూ జీవి ప్రకాష్- సైంధవీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచే వీరు వేర్వేరుగా ఉంటున్నారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు జీవీ ప్రకాశ్- సైంధవీలకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కూతురు అన్విని సైంధవి వద్దే ఉంచేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ కుమార్ కోర్టుకు తెలిపాడు.
విడాకులు తీసుకున్నా తాము మంచి స్నేహితులుగానే కొనసాగుతామని జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి ఇది వరకే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మలేషియాలో జరిగిన జీవీ ప్రకాశ్ సంగీత కచేరీలో సైంధవి పాట పాడారు. కాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడే జీవీ ప్రకాశ్. సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ మంచి గుర్తుంపును తెచ్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు.ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూనే కథానాయకుడిగా కూడా అలరిస్తున్నాడు జీవీ ప్రకాశ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..