
ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో తెచ్చిన మార్పులు, ఆయన అసాధారణ ప్రతిభ గురించి వివరించారు. తన తరం నటులకు డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ ఉండేది కాదని, అవసరమైతే రెండు రోజులు ముందు రిహార్సల్స్ చేసేవారని మురళీ మోహన్ తెలిపారు. ఫైట్స్‌లో కొంతవరకు రిస్క్ షాట్స్ చేసేవారని, డూప్‌లు ఎక్కువగా వాడేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే చిరంజీవి రాకతో తెలుగు సినిమా డ్యాన్స్, ఫైట్స్ చరిత్రే మారిపోయిందని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్‌లకు కొత్త అర్థాన్ని ఇచ్చారని, వాటిలో చలనం, సంచలనం తీసుకొచ్చారని మురళీ మోహన్ అన్నారు. ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్ కంపోజ్ చేసిన వాటిని తమ తరం నటులు సుమారు 50% వరకు మాత్రమే చేయగలిగేవారని, కానీ చిరంజీవి మాత్రం 100% అమలు చేసేవారని అన్నారు. ఒక సందర్భంలో విజయగార్డెన్స్ లో తన షూటింగ్ జరుగుతుండగా, చిరంజీవి అక్కడికి వచ్చి తన డ్యాన్స్‌ను చూసి అభినందించారని, అప్పుడు తన డ్యాన్స్ చిరంజీవి ముందు ఏమీ కాదనిపించిందని మురళీ మోహన్ నవ్వుతూ వివరించారు. అప్పటి తరం నటులు, శోభన్ బాబు లాంటి వారు కూడా డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో హిప్ కావాలా, లిప్ కావాలా అని అడిగేవారని, రెండూ ఒకేసారి చేయడం కష్టం అనేవారని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
చిరంజీవి మొదటి చిత్రం మన ఊరి పాండవులు షూటింగ్ సమయంలో రాజమండ్రి దగ్గర ఒడ్డూరులో జరిగిన సంఘటనలను మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో చిరంజీవి ఏదైనా మ్యూజిక్ పెట్టమని అడిగి, ఏ రిహార్సల్స్ లేకుండానే ఇంగ్లీష్ మ్యూజిక్‌కు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసేవారని ఆయన తెలిపారు. అది శాస్త్రీయం కాకపోయినా, సంగీతానికి సింక్ అయ్యేలా చిరంజీవి చేసే డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారన్నారు. ఆ సమయంలోనే నటుడు కృష్ణదాసు, చిరంజీవిని చూసి “మన సినిమా ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు” అని అన్నారు. కానీ దానికి మురళీ మోహన్ స్పందిస్తూ “విలన్ కాదు బాబు, హీరో అవుతాడు. మొత్తం ఇండస్ట్రీకి ఎమౌంట్ అవుతాడు” అని అప్పుడే అంచనా వేశానని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
చిరంజీవి రాకముందు ఉన్న ఫైట్స్, సాంగ్స్ తో పోలిస్తే ఆయన వచ్చిన తరువాత చాలా మార్పు వచ్చిందని మురళీ మోహన్ వివరించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తప్ప అంత బాగా డ్యాన్స్ చేసేవారు లేరని, కానీ చిరంజీవి వచ్చాక బాడీలో రిథమే మారిపోయిందని తెలిపారు. సూట్ వేసుకున్నా చక్కగా రఫ్ అండ్ టఫ్ గా డ్యాన్స్ చేయగల చిరంజీవి స్టైల్ జనాలను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన అన్నారు. చిరంజీవి ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచారని, ఆ మార్పును తమ తరం సీనియర్ నటులు కూడా స్వాగతించారని మురళీ మోహన్ తెలిపారు. తమ పంచ పాండవులు బ్యాచ్‌తో కలిసి సినిమాకు వెళ్లినప్పుడు, అప్పట్లో జనం ఆటోగ్రాఫ్‌ల కోసం వచ్చేవారని, అప్పుడు చిరంజీవి “అన్నయ్యా రేపు పొద్దున్న నాకు కూడా ఇలా జనం వస్తారా?” అని అడగగా, “ఇలా రావటం ఏంటయ్యా, దీనికన్నా పది రెట్లు వస్తారు నీకు. నువ్వు మాస్ హీరోవి, మేము మాస్ హీరోలం కాదు” అని తాను అంచనా వేశానని మురళీ మోహన్ వివరించారు. బాపు లాంటి దర్శకులు కూడా చిరంజీవి నైపుణ్యాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
Chiranjeevi
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..