Mrunal Thakur: నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన మృణాల్ ఠాకూర్

|

Mar 31, 2023 | 9:29 AM

బాలీవుడ్ లో సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్. ఆతర్వాత అక్కడ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

Mrunal Thakur: నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన మృణాల్ ఠాకూర్
Mrunal Takur
Follow us on

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కాస్త ;గట్టిగా వినిపించిన పేరు మృణాల్ ఠాకూర్. చేసింది ఒకే ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుతుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్. ఆతర్వాత అక్కడ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో సీతారామం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. అందమైన ఈ ప్రేమ కథలో సీతామహాలక్ష్మీ పాత్రలో మెప్పించింది మృణాల్.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. నాని కెరీర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వేదిక పై మృణాల్ మాట్లాడుతూ ఆస్కతికర విషయాలు తెలిపింది. తాను సినిమాల్లో నటించడం తన పేరెంట్స్ కు అస్సలు ఇష్టం లేదని తెలిపింది ఈ బ్యూటీ. మృణాల్ మాట్లాడుతూ.. మాది మరాఠీ ఫ్యామిలీ.. నేను సినిమా రంగంలోకి రావడం నా తల్లి దండ్రులకు ఇష్టం లేదు.. ఎందుకంటే వారికి సినిమా రంగం గురించి  గురించి పెద్దగా తెలియకపోవడమే  కారణం. అందువల్లనే వాళ్ళు నన్ను సపోర్ట్ చేయలేకపోయారు. కానీ నేను నటిగా నిరూపించుకుంటున్నాను. చాలా మంది నన్ను స్మితా పాటిల్ తో పోల్చుతున్నారు. చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకొచ్చింది మృణాల్.