
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు సూచించింది కోర్టు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచార నియమావళిని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జయప్రద పై కేసు నమోదైంది. ప్రస్తుతం దీని పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ జయప్రద విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయప్రదకు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే దీనిపై ఆమె స్పందించలేదు. దీంతో జయప్రదపై కోర్టు వారెంట్ జారీ చేసింది. మార్చి 6న కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
మంగళవారం (ఫిబ్రవరి 27) విచారణలో జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు నేరుగా ప్రకటించింది. ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి మార్చి 6న జయప్రదను విచారణకు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఓ టీమ్ జయప్రదను గాలించనుంది. జయప్రదపై పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేకపోయారు. సీనియర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జయప్రద మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాంతో ఆమెను సంప్రదించలేకపోయారు.
నటి జయప్రద వయసు ఇప్పుడు 61 ఏళ్లు. 1974లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. దీంతో పాటు కన్నడలో ‘సనాది అప్పన్న’, ‘హులియా హోలీ మేవు’, ‘కవిరత్న కాళిదాసు’, ‘ఏకలవ్య’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీ చిత్రసీమలో కూడా ఆమె ఫేమస్. జయప్రద గత కొన్నేళ్లుగా సినిమాల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 1994లో టీడీపీలో చేరారు. 2004లో ఈ పార్టీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2010లో దాన్ని వదిలేశారు. 2014లో రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. దీన్ని వదిలేసి 2019లో బీజేపీలో చేరారు. జయప్రద సినిమాల విషయానికొస్తే ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఓ సినిమా చేశారు. లవ్ ఎట్ 65 అనే సినిమాలో నటించారు జయప్రద.
జయప్రద ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
— Jaya Prada (@realjayaprada) September 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.