టాలీవుడ్‌లో మరో విషాదం..

ఇటీవలే నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ గాయం ఇంకా మానకముందే ప్రముఖ సినీ ఎడిటర్ సిహెచ్ మురళి కన్నుమూశారు. శనివారం మార్నింగ్ ఆయన హార్ట్ అటాక్‌తో స్వగృహంలోనే  మరణించినట్టు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. 64 ఏళ్ల మురళికి భార్యతో పాటు..కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలుగులో చాలా హిట్ మూవీస్‌కి ఆయన ఎడిటర్‌గా సేవలందించారు. ‘పోలీస్‌ భార్య’, ‘పోలీస్‌ శ్రీహరి’, ‘పెద్దింటి అల్లుడు’, ‘కాలేజ్‌ బుల్లోడు’ వంటి తెలుగు […]

టాలీవుడ్‌లో మరో విషాదం..

Edited By:

Updated on: Dec 22, 2019 | 11:17 AM

ఇటీవలే నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ గాయం ఇంకా మానకముందే ప్రముఖ సినీ ఎడిటర్ సిహెచ్ మురళి కన్నుమూశారు. శనివారం మార్నింగ్ ఆయన హార్ట్ అటాక్‌తో స్వగృహంలోనే  మరణించినట్టు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. 64 ఏళ్ల మురళికి భార్యతో పాటు..కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలుగులో చాలా హిట్ మూవీస్‌కి ఆయన ఎడిటర్‌గా సేవలందించారు.

‘పోలీస్‌ భార్య’, ‘పోలీస్‌ శ్రీహరి’, ‘పెద్దింటి అల్లుడు’, ‘కాలేజ్‌ బుల్లోడు’ వంటి తెలుగు చిత్రాలకి మరో ఎడిటర్ రామయ్యతో కలిసి సిహెచ్ మురళి కూర్పు బాధ్యతలను నిర్వర్తించారు.  కేవలం సౌత్‌లోనే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాలకు సైతం ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. 5 భాషల్లో దాదాపు 300 సినిమాలకి పనిచేసిన మురళి మంచి పేరు సంపాదించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  చిత్ర పరిశ్రమలో నటులకు ఉన్నంత క్రేజ్..టెక్నిషియన్లకు పెద్దగా ఉండదు. అందుకే వందల సినిమాలకు పనిచేసిన టెక్నిషియన్లు పరమపదించినా ప్రజలకు పెద్దగా తెలియదు.