Sonu Sood: ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ నుంచి ఆపన్నులను ఆదుకుంటూ రిల్ నటుడు కాస్తా రియల్ హీరో అయ్యాడు. గత ఏడాది లో మొదలైన సోనూ సూద్ సాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరికీ కష్టం వచ్చినా ముందుగా చూసేది సోను వైపే అనడంలో అతిశక్తి లేదు. సెలబ్రెటీలు కూడా సోనూ సూద్ ను సాయం కోరుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ కు అభిమాన గణం తయారు అయ్యారు. సోనూ సూద్ నుంచి సాయం పొందినవారు, పొందనివారు, ఇలా చాలా మంది పలు రకాలుగా సోనూసూద్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఉమా సింగ్ అనే అభిమాని అందరికంటే భిన్నంగా ఆలోచించాడు.. తన అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు. సైకిలిస్ట్ అయిన ఉమాసింగ్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వరకు సైకిల్‌పై వెళ్లాడు. అక్కడి నుంచి కాలి నడకతో పర్వతాన్ని అధిరోహించి అక్కడ భారత దేశం త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్‌లో సోనూసూద్‌ను చూపిస్తూ రియల్ హీరో ఆఫ్ ఇండియా అని ప్రకటించాడు.
ఇలా పర్వతంపై పతాకాన్ని ఆవిష్కరించడం వీడియోగా చిత్రీకరించి ట్వీట్ చేశాడు. ఈ వీడియో పై సోనూ సూద్ స్పందించారు. వావ్..ఇకపై నేను మౌంట్ కిలిమంజారో అన్నమాట..చాలా గర్వంగా ఉంది ఉమ అంటూ ట్విట్ కు రిప్లయ్ ఇచ్చాడు.
ఉమా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అతను చాలా కష్టమైన పనిని సాధించడానికి ముందుకు వెళ్లాడు. ఈ ఘనత సాధించడానికి అతని కృషి , దృఢ సంకల్పం అతనికి సహాయపడ్డాయి. అతని మాటలతో నేను చాలా చలించిపోయాను. అతను మన యువతకు స్ఫూర్తి . ఇంత చిన్న వయసులో అతని సంకల్పం చూస్తుంటే మన భారతీయ యువత ఏదైనా చేయాలనీ మనసులో భావిస్తే.. దానిని సాధించేవరకూ నిద్రపోరని ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారని సోనూ సూద్ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్విట్ రీ ట్విట్స్ తో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అయితే సోనూ సూద్ దాతృత్వానికి .. బాధితుల బంధువులు, స్నేహితులు జేజేలు పలుకుతున్నారు .సోనూ చేసిన సేవలను సాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.
15th Aug.I was on top of Africa continent’s highest mountain Mt. Kilimanjaro with a bicycle
To salute the man who is already on top This victory is dedicated to the only real superhero @SonuSood sir
Thank you sir for always being an inspiration
Thanks @Sadhu_Baijnath for support pic.twitter.com/XIp0KS7817— Uma singh (cyclist and mountaineer) (@CyclistUma) August 16, 2021