ప్రజెంట్ ఇండస్ట్రీ అంతా ఓపెన్ అయ్యింది. దాదాపు అన్ని రాష్ట్రాలల్లో సినిమా ఇండస్ట్రీ మీద రిస్ట్రక్షన్స్ ఎత్తేశారు. థియేటర్లు కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. అందుకే ఇన్ని రోజులు సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న మేకర్స్… ఇప్పుడు రిలీజ్‌కు క్యూ కడుతున్నారు. ఈ టైమ్‌లో కూడా మలయాళ మేకర్స్ మాత్రం డిజిటల్ వైపే చూస్తున్నారు.
లేటెస్ట్‌గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 12th మ్యాన్ మూవీ డిజిటల్ రిలీజ్‌కు వెళుతుందన్న న్యూస్ మాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా ఓపెన్ అయిన టైమ్‌లో మోహన్‌లాల్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారన్న డిస్కషన్ జరుగుతోంది. ఒక్క మోహన్‌లాల్ మాత్రమే కాదు మాలీవుడ్‌లో చాలా మంది స్టార్స్ ఓటీటీ వైపు సీరియస్‌గానే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.
రీసెంట్‌గా మోహన్‌లాల్‌తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ బ్రో డాడీ సినిమా చేశారు. పృథ్వీరాజ్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా డిజిటల్‌లోనే రిలీజ్ అయ్యింది. టొవినో థామస్ లీడ్ రోల్‌లో నటించిన మిన్నల్ మురళీ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు 12th మ్యాన్ కూడా అదే బాటలో నడిచే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
థియేట్రికల్ బిజినెస్ ఓపెన్ అయిన తరువాత కూడా మలయాళ మేకర్స్ డిజిటల్ రిలీజ్ వైపు ఎందుకెళుతున్నట్టు…? ఈ నిర్ణయం వెనుక సాలిడ్ రీజనే ఉందట. టాలీవుడ్, బాలీవుడ్‌లతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ చాలా చిన్నది. అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా 25, 30 కోట్ల మార్కెట్ రేంజ్‌లోనే ఉంటాయి. ప్రజెంట్ ఓటీటీ సంస్థల నుంచి కూడా అదే రేంజ్ ఆఫర్స్ వస్తుండటంతో స్టార్ హీరోలు కూడా డిజిటల్ రిలీజ్‌కు మొగ్గుచూపుతున్నారు.
థియేట్రికల్ రిలీజ్ అంటే హిట్ టాక్ వస్తేనే కలెక్షన్లు వస్తాయి. కానీ ఓటీటీ రిలీజ్ అయితే ముందే సినిమాను అవుట్ రైట్‌గా అమ్మేస్తారు. కాబట్టి.. నిర్మాతలకు ఎలాంటి రిస్క్ ఉండదు. దీనికి తోడు కేరళలో స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా చాలా ఎక్కువ కాబట్టి డిజిటల్ రిలీజ్‌తో సినిమా ఎక్కువ మంది చేరుతుందని నమ్ముతున్నారు. మలయాళ మేకర్స్. అందుకే ఇప్పటికీ మలయాళ స్టార్ హీరోలు డిజిటల్ వైపే చూస్తున్నారు.
బైలైన్.. Sathish, ETT, Tv9
Adipurush: ఆదిపురుష్ స్టోరీ ఇదే అంటూ డైరెక్టర్ క్లారిటీ.. ప్రభాస్ రాముడు కాదంటూ..
Naresh: సినీ నటుడు నరేశ్ పేరుతో మహిళ భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు.. ఆమెతో సంబంధం లేదంటూ..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ సినిమాలో..