మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న మోహల్​లాల్​, ఎన్టీఆర్​ !

కంప్లీట్ యాక్ట‌ర్ మొహ‌న్‌లాల్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తే సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బాస్ట‌ర్ అవుతుందో 'జనతా గ్యారేజ్​' చిత్రంతో చూశాం.

మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న మోహల్​లాల్​, ఎన్టీఆర్​ !

Updated on: Aug 18, 2020 | 8:05 AM

కంప్లీట్ యాక్ట‌ర్ మొహ‌న్‌లాల్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తే సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బాస్ట‌ర్ అవుతుందో ‘జనతా గ్యారేజ్​’ చిత్రంతో చూశాం. మ‌రోసారి ఆ కాంబినేష‌న్ రిపీట్ అయితే. ఫ్యాన్స్‌కు పండ‌గే. తాజాగా ఆ ప్ర‌చార‌మే జ‌రుగుతుంది. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌తో తార‌క్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఓ ప్ర‌త్యేక పాత్ర కోసం మోహ‌న్‌లాల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా స‌మ‌యం ల‌భించ‌డంతో ఈ సినిమా క‌థ‌కు త్రివిక్ర‌మ్ తుది మెరుగులు దిద్దార‌ని తెలుస్తోంది.

‘అల వైకుంఠపురములో’ విడుదల తర్వాత నుంచి త్రివిక్రమ్​.. ఎన్టీఆర్‌ చిత్రంపైనే ఫోక‌స్ పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అది కంప్లీట్ అయిన‌ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోయే మూవీ కోసం రంగంలోకి దిగుతారు. ఎన్టీఆర్‌ నటించబోయే 30వ సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రూ ‘అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ’ తో సూప‌ర్‌హిట్ విజ‌యం అందుకున్నారు. ఈసారి ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తారో చూడాలి.

Also Read :

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !