ఆ డైరెక్టర్‌కే మళ్లీ.. మళ్లీ ఛాన్స్.. మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించేసిన మలయాళీ సూపర్ స్టార్..!

| Edited By: Ravi Kiran

Jul 15, 2023 | 10:30 PM

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌... ఓ సక్సెస్‌ సెంటిమెంట్‌ ను మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తున్నారు. తనకు వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడితో గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్నారు మోహన్‌లాల్‌.

ఆ డైరెక్టర్‌కే మళ్లీ.. మళ్లీ ఛాన్స్.. మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించేసిన మలయాళీ సూపర్ స్టార్..!
Mohanlal
Follow us on

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌… ఓ సక్సెస్‌ సెంటిమెంట్‌ ను మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తున్నారు. తనకు వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడితో గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్నారు మోహన్‌లాల్‌. వేరే సినిమాలు ఎన్ని సెట్స్ మీద ఉన్నా… ఆ డైరెక్టర్‌తో మాత్రం ఓ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దృశ్యం సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్‌ చేశారు హీరో మోహన్‌లాల్‌, డైరెక్టర్ జీతూ జోసెఫ్‌. మలయాళ సినిమాగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్… తరువాత దాదాపు అన్ని భారతీయ భాషల్లో రీమేక్‌ అయ్యింది. అందుకే తనకు ఈ రేంజ్‌ మూవీ అందించిన జీతూతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నారు మోహన్‌లాల్.

దృశ్యం రిలీజ్‌ అయిన ఏడేళ్ల తరువాత ఈ కాంబినేషన్‌లో దృశ్యం 2 సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో ఈ కాంబోలో మరిన్ని మూవీస్‌ ప్లాన్ చేస్తున్నారు మోహన్‌లాల్‌. వరుసగా దృశ్యం కైండ్ థ్రిల్లర్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 12th Man డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రాకపోయినా.. జీతూతో మరిన్ని సినిమాలు చేసేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మోహన్‌లాల్‌. ఆల్రెడీ ఈ కాంబినేషన్‌లో రామ్ పార్ట్ 1 షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీతో పాటు మరిన్ని సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. రామ్ మూవీ వర్క్ జరుగుతుండగానే దృశ్యం 3 ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. తాజాగా ఇదే కాంబినేషన్‌లో మరో మూవీ కూడా ఎనౌన్స్ అయ్యింది. రామ్ పార్ట్ వన్‌, దృశ్యం 3 పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.