Mohan Babu: స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య పై మోహన్ బాబు సీరియస్.. అలా చేయడం నచ్చదంటూ..

|

Oct 17, 2021 | 10:24 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) ఫిల్మ్ నగర్ కల్చరర్

Mohan Babu: స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య పై మోహన్ బాబు సీరియస్.. అలా చేయడం నచ్చదంటూ..
Mohan Babu
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్‏లో తన ప్యానల్ సభ్యులతో కలసి ప్రమాణా స్వీకారం చేశారు.. ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ, సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా వచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందకపోవడంతో వారు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే ప్రమాణా స్వీకార వేడుకలో సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.. ఈ క్రమంలోనే.. నటుడు శివబాలాజీ భార్య మధుమితపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

నా జీవితం తెరిచిన పుస్తకం.. నా పుస్తకం మొదటి పేజీలో విలన్ గా చేయాలని అనుకున్నాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా, ప్రతినాయకుడిగా చేశాను.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం.. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్ తోనే కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు.. పాలిటిక్స్ లో కంటే ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను అంటూ మాట్లాడుతున్నారు.. ఇక మోహన్ బాబు స్పీచ్ ఇస్తున్న సమయంలో వెనక శివబాలాజీ భార్య మధుమిత మాట్లాడుతూ ఉంది. దీంతో ఆమెపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు.. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు.. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న విషయాలు ఆగిపోతాయన్నారు..

Also Read: Ravi Teja: ‘క్రాక్’ ఇచ్చిన కిక్‌తో ట్రాక్‌లోకి మాస్ రాజా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా రవితేజ..

Nani: ‘దసరా’తో నేచురల్ స్టార్ సక్సెస్ దారిలోకి వచ్చేనా..? మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్న నాని..

Bigg Boss 5 Telugu: రూటు మార్చిన బిగ్‏బాస్.. యాంకర్స్‏ను పక్కనపెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్లను..

Aadavaallu Meeku Joharlu: సరికొత్త జోనర్‌లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. యంగ్ హీరో ఆశలన్నీ ఈ సినిమాపైనే..