Maa Elections 2021: ‘మా’ ఎన్నికల సమరం.. సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానల్..

మా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

Maa Elections 2021: మా ఎన్నికల సమరం.. సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానల్..
Manchu Vishnu

Updated on: Oct 01, 2021 | 9:29 PM

Maa Elections 2021: మా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. అద్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అలాగే మా బిల్డింగ్.. మనమంతా ఒక్కటే అనే అస్త్రాలతో ఓట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోజు రోజుకీ రకారకాల ట్విస్ట్‏లు చోటు చేసుకుంటూ సాధారణంగా ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నిన్నటివరకు జీవిత మీద పోటీచేస్తానని చెప్పుకొచ్చిన బండ్ల సడన్‌గా వెనకడుగేశారు.. తన మద్దతు పూర్తిగా ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు బండ్ల.

ఇక మంచు విష్ణు ప్రచారానికి జోరు పెంచారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన నేడు సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. మోహన్ బాబుతో పాటు తన ప్యానల్‌తో కృష్ణ ఇంటికి వెళ్లారు మంచు విష్ణు.. కృష్ణ మద్దతు తమకు ఉందని మొదటి నుంచి విష్ణు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తన ప్యానల్‌తో కృష్ణను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.


మరిన్ని ఇక్కడ చదవండి : 

‎aha – OTT: ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి… ‘త్రీ రోజెస్’ ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల

Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..