Maa Elections 2021: ‘మా’ ఎన్నికల సమరం.. సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానల్..

మా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

Maa Elections 2021: 'మా' ఎన్నికల సమరం.. సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానల్..
Manchu Vishnu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2021 | 9:29 PM

Maa Elections 2021: మా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. అద్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అలాగే మా బిల్డింగ్.. మనమంతా ఒక్కటే అనే అస్త్రాలతో ఓట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోజు రోజుకీ రకారకాల ట్విస్ట్‏లు చోటు చేసుకుంటూ సాధారణంగా ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నిన్నటివరకు జీవిత మీద పోటీచేస్తానని చెప్పుకొచ్చిన బండ్ల సడన్‌గా వెనకడుగేశారు.. తన మద్దతు పూర్తిగా ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు బండ్ల.

ఇక మంచు విష్ణు ప్రచారానికి జోరు పెంచారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన నేడు సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. మోహన్ బాబుతో పాటు తన ప్యానల్‌తో కృష్ణ ఇంటికి వెళ్లారు మంచు విష్ణు.. కృష్ణ మద్దతు తమకు ఉందని మొదటి నుంచి విష్ణు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తన ప్యానల్‌తో కృష్ణను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. Krishna

మరిన్ని ఇక్కడ చదవండి : 

‎aha – OTT: ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి… ‘త్రీ రోజెస్’ ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల

Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?