Miss Shetty Mr Polishetty : ఆకట్టుకుంటున్న ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అందమైన మెలోడీ

|

Jul 11, 2023 | 3:47 PM

బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. అనుష్క ఆతర్వాత మెల్లగా సినిమాలు చేస్తోంది. చివరిగా నిశ్శబ్డం అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Miss Shetty Mr Polishetty : ఆకట్టుకుంటున్న మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అందమైన మెలోడీ
Miss Shetty Mr Polishetty
Follow us on

అందాల భామ అనుష్క.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. అనుష్క టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. అనుష్క ఆతర్వాత మెల్లగా సినిమాలు చేస్తోంది. చివరిగా నిశ్శబ్డం అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. యంగ్ హీరో నవీన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఈ కుర్ర హీరో నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రానున్నారు.

ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. లేడీ లక్ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. కార్తీక్ ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది ఈ మెలోడీ

ఇక మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ఆగస్టు 4న విడుదల చేయనున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. అలాగే అనుష్క చెఫ్ గా నటించనుంది.