నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మెహ్రీన్. ఆ తర్వాత రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఎఫ్2 సినిమాలో వరుణ్ ప్రేయసిగా హనీ పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో ఆమె పలికిన ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అనే డైలాగ్ బాగా గుర్తుండిపోతుంది. తెలుగులో బాగానే సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకోలేకపోయింది. ఎఫ్3 తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. కరోనా కాలంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్ చేసుకుంది మెహ్రీన్. 2021 మార్చిలో మెహ్రీన్-భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్‌లో ఘనంగా జరిగింది.పెళ్లి ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారు. అప్పట్లో వీరిద్దరి ఫొటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. అయితే ఏమైందో తెలియదు కానీ పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు.
మెహ్రీన్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంటే.. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు భవ్య భిష్ణోయ్. ప్రస్తుతం హర్యానాకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కాగా ఇప్పుడు భవ్య బిష్ణోయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన .. ‘నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన ప్రశ్నను నిన్ను అడిగేందుకు ఇంతకంటే స్పెషల్ ప్లేస్ గురించి ఆలోచించడం సాధ్యం కాలేదు.. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం భవ్య భిష్ణోయ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Couldn’t think of a more special place to ask you possibly the most important question of my life… where it all began… and where it begins for us… pic.twitter.com/qWSssP6ljt
— Bhavya Bishnoi (@bbhavyabishnoi) May 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..