
నితిన్ నటించిన లై అనే సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మేఘ ఆకాష్.

లై సినిమా తర్వాత వెంటనే నితిన్‌తో మరో సినిమా చేసింది చల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ చిన్నది తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది.

అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇక ఇప్పడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేఘ ఆకాష్.

శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోర అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది.

అలాగే డియర్ మేఘ అనే సినిమాలోనూ నటిస్తుంది.

ఈ రెండు సినిమాలపై ఈ ముద్దుగుమ్మ భారీ ఆశలే పెట్టుకుంది.