Ramcharan: పెద్ద ప్లానే.. మరోసారి అలాంటి పాత్రలో రామ్ చరణ్.. ఏ సినిమాలోనంటే
ఇప్పటికే టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్ చరణ్, గేమ్ చెంజర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. చరణ్‌తో సినిమాలు చేయడానికి దర్శన నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్ చరణ్, గేమ్ చెంజర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. బాలీవుడ్ లెజెండ్రీ దర్శకుల్లో సంజయ్ లీల బన్సాలి ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. సంజయ్ లీల బన్సాలి ఇప్పుడు చరణ్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్ బాలీవుడ్ లో జోరుగా సాగుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాను పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారట. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.
సంజయ్ లీలా బన్సాలీ ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో ఓ భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్నారట. మొన్నామధ్య రామ్ చరణ్ ముంబైకి వెళ్ళింది కూడా సంజయ్ లీల సినిమా కోసమేనట. తన పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి చర్చించడానికే చరణ్ ముంబై వెళ్లారని టాక్. ‘లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్’ అనే అమిష్ త్రిపాఠి పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో సుహెల్‌దేవ్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇది 1025 ADలో కాలం లో జరిగింది. మహమూద్ గజినీ శివుడి విగ్రహాన్ని పగలగొట్టి సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు. శ్రావస్తి యువరాజు ఆలయాన్ని రక్షించడానికి వెళ్తాడు. కానీ ఆలయాన్ని రక్షించడంలో ఆయన తన ప్రాణాలను కోల్పోతారు. అతని తమ్ముడు సుహెల్దేవ్. వాస్తవానికి సుహెల్దేవ్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని హామీ ఇచ్చాడు. 1034 CEలో బహ్రైచ్‌లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లో సుహెల్‌దేవ్ గజినీ సైన్యాన్ని ఓడించాడు. ఇదే కథతో ఇప్పుడు సినిమా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.