Bhola Shankar: భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..

|

Aug 03, 2023 | 8:41 PM

డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్ట్ 11న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్.

Bhola Shankar: భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..
Bhola Shankar
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్ట్ 11న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా.. ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్.

భోళా శంకర్ ఈవెంట్ ఆగస్ట్ 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకకు అతిథిగా ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం తెలియజేయలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ తెలియడంతో మెగా అభిమానులు వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే.. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ మెహర్ రమేశ్. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాలో చిరు ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయనకు చెల్లిగా కీర్తి కనిపించనుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.