Bhola Shankar: భోళా శంకర్ ఓటీటీ పార్ట్‏‏నర్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో చిరు, తమన్నా జంటగా నటించారు. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. ఇక ఆమె ప్రియుడిగా సుశాంత్ కనిపించగా.. గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలకపాత్రలు

Bhola Shankar: భోళా శంకర్ ఓటీటీ పార్ట్‏‏నర్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Bhola Shankar

Updated on: Aug 11, 2023 | 9:20 PM

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన భోళా శంకర్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో చిరు, తమన్నా జంటగా నటించారు. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. ఇక ఆమె ప్రియుడిగా సుశాంత్ కనిపించగా.. గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్ నర్ మాత్రం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని.. దాదాపు 5 నుంచి 6 వారాల తర్వాత అంటే సెప్టెంబర్ చివరికల్లా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మరో హిట్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత చిరు.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ.. చాలా కాలం తర్వాత చిరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.