మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గత కొద్ది రోజుల క్రితం కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్లో ఉంటూ వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 29న చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి ఘనంగా జరిపించేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా తన తల్లిని కలుసుకోలేకపోయారు.
దీంతో తన తల్లికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” అమ్మా !.. జన్మదిన శుభాకాంక్షలు.. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో …. శంకరబాబు.” అంటూ ట్వీట్ చేస్తూ… భార్య సురేఖ.. తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు. ఇందులో కాజల్, పూజా హెగ్డే, రామ్ చరణ్ కీలకపాత్రలలో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా వేసారు మేకర్స్.
ట్వీట్..
అమ్మా !??
జన్మదిన శుభాకాంక్షలు ??క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ ?
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..