
మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా లూసీఫర్ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో మెగాస్టార్ దూసుకురాబోతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్స్ట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేతున్నారు చిరు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.
ఇక రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి తప్పకుండా వస్తుంది అని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఒక సాలీడ్ రేటుకు మెగాస్టార్ మూవీను దక్కించుకుందట అయితే వాల్తేరు వీరయ్యను మూడు వారాలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేవిధంగా డీల్ సెట్ చేసుకుంటే ఇప్పుడు అనుకున్న డీల్ కంటే ఎక్కువ స్థాయిలో అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట నెట్ ఫ్లిక్స్ సంస్థ. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.