AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: మునుపెన్నడూ ట్రై చేయని యాంగిల్‌లో మాస్ మహారాజ మూవీ.. ఈగల్‌గా రానున్న రవితేజ

వరుస సినిమాలను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు రవితేజ.

Ravi Teja: మునుపెన్నడూ ట్రై చేయని యాంగిల్‌లో మాస్ మహారాజ మూవీ.. ఈగల్‌గా రానున్న రవితేజ
Raviteja
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2022 | 7:27 AM

Share

మాస్ మహారాజ రవితేజ అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మొన్నామధ్య క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత షరామామూలే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో త్రినాథరావు నక్కిన  దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశాడు మాస్ రాజా.

వీటీలో రావణాసుర, టైగర్ నాగేశ్వరావు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఈగల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితేజ. రవితేజ ట్రై చేయని యాంగిల్ లో ఆ సినిమా తెరకెక్కుతుందట. కార్తీక్ ఘట్టమనేని ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు కార్తీక్ కార్తికేయ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అతను విభిన్నమైన కథతో రవితేజతో ఈగల్ అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందట.ఈ మూవీ షూటింగ్ ను పోలాండ్ దేశంలో మొదలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించారట దర్శకుడు కార్తీక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు