తెలుగు నట సింహాం నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు.
అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆచరణలోకి రావడం లేదు. ఇవాళ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
”ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. అది తెలుగువారందరికీ గర్వ కారణం.. ఆయన 100వ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా.. ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే.. అది తెలుగువారికి దక్కే గౌరవం” అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!