Megastar Chiranjeevi: ‘రోషన్‏తో కలిసి డాన్స్ చేయాలనిపించింది’.. ‘బబుల్ గమ్’ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన చిరు..

ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా కనిపించింది. ఈసినిమాను మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మించగా.. వచ్చే నెల డిసెంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు భారీగానే ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. ఇక ఫస్ట్ సాంగ్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.

Megastar Chiranjeevi: రోషన్‏తో కలిసి డాన్స్ చేయాలనిపించింది.. బబుల్ గమ్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన చిరు..
Megastar Chiranjeevi, Rosha

Updated on: Nov 24, 2023 | 7:00 AM

స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బబుల్ గమ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా కనిపించింది. ఈసినిమాను మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మించగా.. వచ్చే నెల డిసెంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు భారీగానే ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. ఇక ఫస్ట్ సాంగ్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

గురువారం తన నివాసంలో బబుల్ గమ్ సినిమాలోని సెకండ్ సాంగ్ ఇజ్జత్ పాటను విడుదల చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఇజ్జత్ సాంగ్ చాలా బాగుందని కొనియాడారు. ర్యాప్ సాంగ్ వింటుంటే తనకు కూడా రోషన్ తో కలిసి డాన్స్ చేయాలనిపించిందని.. ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని.. ఇప్పుడు సెకండ్ సాంగ్ సైతం రాక్ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల చక్కని మ్యూజిక్ అందించారని.. ఈ సినిమాలోని ర్యాప్ సాంగ్ ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో మారుమోగిపోతుందని అన్నారు. మానస చౌదరి చాలా అద్భుతంగా నటించిందని.. తను తెలుగుమ్మాయే కావడం అభినందనీయం.. సుమ, రాజీవ్ ఎంతో ఆనందపడే క్షణాలు త్వరలోనే రాబోతున్నాయని అన్నారు చిరంజీవి.

ఈ సినిమాలో హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.