Acharya Movie: కోకాపేటలో ఆచార్య కోసం భారీ సెట్.. జులై లో షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టనున్న చిత్రయూనిట్…

|

May 28, 2021 | 8:12 PM

మెగాస్టార్  చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Acharya Movie: కోకాపేటలో ఆచార్య కోసం భారీ సెట్.. జులై లో షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టనున్న చిత్రయూనిట్...
Follow us on

Acharya Movie:

మెగాస్టార్  చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో అది వైరల్ గా మారుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది.  ఈ ‘ఆచార్య’ పాఠాలు కాదు .. గుణపాఠాలు చెబుతాడని అంటూ ఆ పాత్ర స్వభావాన్ని కొరటాల ముందుగానే చెప్పేశారు. చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు చిత్రయూనిట్ . ‘కోకాపేట’లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణను  పూర్తిచేయనున్నారు. జులైలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసి, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ కి వెళ్లనున్నాడని అంటున్నారు. లూసిఫర్  రీమేక్ ను మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే .

మరిన్ని ఇక్కడ చదవండి :

Manchu Vishnu: కూతురు విసిరిన ఛాలెంజ్ కోసం మంచు విష్ణు చేసిన పనికి షాక్ అయిన మోహన్ బాబు..

అఖిల్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మేకర్స్ ఏమంటున్నారంటే…

Vijayendra Prasad Puri: బాహుబ‌లి ర‌చ‌యిత మొబైల్ వాల్‌పేప‌ర్‌పై ద‌ర్శ‌కుడు పూరి ఫొటో.. కార‌ణ‌మేంటో తెలుసా.?