సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. డైరెక్టర్ సుకుమార్ రాసిన కథను అతని అసిస్టెంట్ కార్తీక్ దండు తెరకెక్కించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. హర్రర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షోతో మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. మేకింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ వీటన్నింటి గురించి మాత్రమే కాకుండా.. తేజ్, సంయుక్త యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సినీ విశ్లేషకులు సైతం ఈ మూవీపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి తేజ్ ఎమైషనల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విజయం పై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
“విరూపాక్ష సినిమాకు వస్తున్న మంచి రిపోర్ట్స్ వింటున్నాను. నీకోసం చాలా సంతోషిస్తున్నాను తేజ్. ఒక బ్యాంగ్ తో నువ్వు మళ్లీ తిరిగి కంబ్యాక్ వచ్చావు. ప్రేక్షకులు నిన్ను అప్రిషియేట్ చేస్తూ వారి బ్లెస్సింగ్ తెలియజేస్తున్నారు. టీం అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు చిరు. దానికి సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇచ్చారు. థాంక్యూ మామా అత్తా అంటూ రిప్లై ఇస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు.
మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ్… తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు దూరంగా ఉన్న తేజ్.. విరూపాక్ష సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. మొదటి రోజు నుంచే అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో ఫుల్ జోష్ మీదున్నారు సాయి తేజ్.
Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. ?Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! ??@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.