Megastar chiranjeevi: నా సినిమా రీమేక్‏లు ఆ హీరోలు చేస్తే బాగుంటుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..

అక్కినేని సమంత వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడదల చేసిన సంగతి తెలిసిందే.

Megastar chiranjeevi: నా సినిమా రీమేక్‏లు ఆ హీరోలు చేస్తే బాగుంటుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..

Updated on: Dec 22, 2020 | 7:25 PM

అక్కినేని సమంత వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో మెగాస్టార్ పలువురు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిస్తూ కనిపించారు.

కాగా ఈ షోలో వైవా హర్ష కూడా పాల్గొననున్నారు. అయితే ఇందులో వైవా హర్ష మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ.. మీకొక ఛాలెంజ్ సార్.. మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఒకవేళ రీమేక్ చేయాలంటే మీ పాత్రను ఎవరు సమర్థవంతంగా నటించగలుగుతారు? అని అడగగా.. ‘చరణ్, తారక్, ప్రభాస్, బన్నీ, రవితేజ, విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు, పవన కళ్యాణ్’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఈ మెగా ఎపిసోడ్ డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ రోజున ఓటీటీలో ప్రసారం కానుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తూన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్‏లో నటించనున్నారు.