AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana: స్వచ్ఛమైన స్పటికంలాంటి మనిషి కైకాల సత్యనారాయణ.. ఎమోషనల్ అయిన చిరంజీవి

నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు కైకాల భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు.

Kaikala Satyanarayana: స్వచ్ఛమైన స్పటికంలాంటి మనిషి కైకాల సత్యనారాయణ.. ఎమోషనల్ అయిన చిరంజీవి
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2022 | 12:45 PM

Share

కైకాల మరణ వార్త తెలుగు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. అనారోగ్యంతో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. 87ఏళ్ల కైకాల సినీ జీవితంలో ఎన్నో మలుపులు చూశారు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కైకాల. నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు కైకాల భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కైకాల సత్యనారాయణ మరణం పై  ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ లేఖను పోస్ట్ చేశారు.

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోందని చిరంజీవి అన్నారు. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరని మెగాస్టార్ అన్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీ కైకాల సత్యన్నారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.

నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు.

శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాటాభజిన సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.