OTT Movies: వీకెండ్ డబుల్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన క్రేజీ మూవీస్ ఇవే!

థియేటర్లతో పాటుగా ఓటీటీలు కూడా ప్రతీ వారం సూపర్ హిట్ చిత్రాలతో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ వర్గం ప్రేక్షకులు..

OTT Movies: వీకెండ్ డబుల్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన క్రేజీ మూవీస్ ఇవే!
Ott Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2022 | 9:47 AM

థియేటర్లతో పాటుగా ఓటీటీలు కూడా ప్రతీ వారం సూపర్ హిట్ చిత్రాలతో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ వర్గం ప్రేక్షకులు ఓటీటీల్లో వచ్చే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. మరి ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు సినిమాలు సిద్దమయ్యాయి. అవేంటో చూసేద్దాం పదండి..

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం:

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. నవంబర్‌ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. డిసెంబర్ 23 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

మసూద:

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘మసూద’. ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయం కాగా.. సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్ ముఖ్య పాత్రలను కనిపించారు. నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ టుడే:

ఈ తమిళ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి దాదాపుగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అన్ని సెంటర్ల ప్రేక్షకులకు ఈ లవ్ ఎంటర్టైనర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో ‘లవ్ టుడే’ పేరుతో నవంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీల్లో అలరించేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈరోజు అర్ధరాత్రి నుంచి లవ్ టుడే తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. దీనితో పాటు కన్నడ, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

థ్యాంక్ గాడ్:

సిద్ధార్థ్‌ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం’థ్యాంక్‌ గాడ్’. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌‌గా నటించింది. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. ఈ మూవీ డిసెంబర్ 20వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

జయ జయ జయ జయహే:

బసిల్‌ జోసెఫ్‌, దర్శనా రాజేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ హిట్ మూవీ ‘జయ జయ జయ జయహే’. ఈ చిత్రానికి విపిన్ దాస్ దర్శకుడు కాగా.. అంకిత్ మేనన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 22 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

రామ్ సేతు:

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం ‘రామ్‌ సేతు’. రామ్‌ సేతు కథాంశం నేపధ్యంలో సాగే ఈ అడ్వెంచర్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించగా.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్‌ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో ఈ మూవీని ఉచితంగా చూసేయొచ్చు.

టీచర్:

అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘ది టీచర్’. దీనికి వివేక్ దర్శకత్వం వహించగా.. హక్కిమ్, చెంబాన్ వినోద్ కీలక పాత్రల్లో నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!