Megastar Chiranjeevi: పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకో తెలుసా ?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు మొత్తం కాదండి.. పేరులో ఒక అక్షరం మాత్రమే. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్ గా

Megastar Chiranjeevi: పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకో తెలుసా ?
Megastar

Updated on: Jul 05, 2022 | 2:15 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా చిత్రీకరణలో పాల్గోంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు మొత్తం కాదండి.. పేరులో ఒక అక్షరం మాత్రమే. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి చిరు ఫస్ట్ లుక్ గ్లింప్స్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. అందులో చిరంజీవి ఇంగ్లీష్ పేరులో మరో అక్షరం ‘E’ ని చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ మెగాస్టార్ పేరు మార్చడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సోమవారం చిరు నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి చిరు ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో సునీల్.. చిరుకు రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తున్నాడు. కారు నుంచి మెగాస్టార్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక అదే సమయంలో స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించింది. అయితే అందులో చిరు పేరులో మరో ‘E’ లెటర్ కనిపిస్తోంది. Megastar Chiranjeevi అని కాకుండా Megastar Chiranjeeevi అని స్క్రీన్ పై వచ్చింది.  దీంతో చిరు పేరు మార్చుకున్న అంశం తెర మీదకు వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం న్యూమరాలజిస్టుల సూచనల మేరకు చిరు తన పేరులో మరో అక్షరాన్ని జతచేసినట్లుగా తెలుస్తోంది.

Megastar Chiranjeeevi

ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చిరు కాస్త ఆలోచనలో పడ్డారని.. తదుపరి సినిమాల ఫలితాల దృష్ట్యా చిరు న్యూమరాలజిస్టుల సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం చిరు చేతిలో వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.