Ramesh Babu: రమేష్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేసిన చిరు, చంద్రబాబు.. తదితరులు.. మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు..

|

Jan 09, 2022 | 9:49 AM

Ramesh Babu Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు  అన్న నటుడు నిర్మాత రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. రమేష్ మృతికి సినీ..

Ramesh Babu: రమేష్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేసిన చిరు, చంద్రబాబు.. తదితరులు.. మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు..
Ramesh Babu
Follow us on

Ramesh Babu Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు  అన్న నటుడు నిర్మాత రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. రమేష్ మృతికి సినీ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. కృష్ణ పుత్ర శోకాన్ని తట్టుకునే శక్తినివ్వాలంటూ కోరుకుంటున్నారు. తాజా మెగాస్టార్ చిరంజీవి  చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌మేష్ బాబు మ‌ర‌ణంపై సంతాపాన్ని వ్యక్తం  చేశారు.  రమేష్ బాబు మరణవార్త వినగానే షాకయ్యాను. ఎంతో బాధ కలిగింది. కృష్ణగారికి, మ‌హేష్‌కి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చిరంజీవి. ఈ బాధాక‌ర‌మైన ప‌రిస్థితి నుంచి కుటుంబ సభ్యులు కోలుకునేలా భ‌గ‌వంతుడు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని తాను  కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.

 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రమేష్ బాబు మృతిపై స్పందించారు. రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు కోరుకున్నారు. రమేష్ బాబు కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ గారి  కుటుంబానికి ఈ క్లిష్ట సమయం లో మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు సంతాపం తెలిపారు.

ఘట్టమనేని రమేష్‌బాబు మృతి పట్ల నితిన్ ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. రమేష్ బాబు గారి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రమేష్ బాబు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

టాలీవుడ్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కూడా కృష్ణ ఫ్యామిలీకి ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

రమేష్‌బాబు గారి అకాల మరణం బాధాకరమని వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశాడు.

గత కొన్ని రోజులుగా లివర్ వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 2022, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో అన్నాను చివరిసారి చూసుకోవడానికి వస్తాడా రాడా .. అన్నాను చివరి సారి చూసుకునే అవకాశాన్ని కరోనా మహమ్మారి దూరం చేసిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read:  రమేష్ బాబు మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం.. పుత్ర శోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని సూపర్ స్టార్ కృష్ణకు …