Megastar Chiranjeevi:బిజీ బిజీగా మెగాస్టార్.. వరుసగా సెట్స్ పైకి నయా ప్రాజెక్ట్.. భోళా శంకర్ షూటింగ్ ఎప్పుడంటే..

|

Oct 15, 2021 | 8:40 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు.

Megastar Chiranjeevi:బిజీ బిజీగా మెగాస్టార్.. వరుసగా సెట్స్ పైకి నయా ప్రాజెక్ట్.. భోళా శంకర్ షూటింగ్ ఎప్పుడంటే..
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తై ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత మెగాస్టార్.. భోళా శంకర్ సినిమా చేయనున్నాడు.. తమిళంలో హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఈ సినిమా. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం అందిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.. ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్న మహతి స్వర సాగర్ పుట్టినరోజు శుక్రవారం.. ఈ సందర్భంా.. చిత్రయూనిట్ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇందులో నటించే నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లుగా తెలిపింది. ఇక ఇటీవల ప్రారంభమైన గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఇందులోని స్పెషల్ సాంగ్ కోసం అమెరికా పాప్ సింగర్ ను తీసుకురాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also  : Aranya Movie: ఓటీటీలోకి రానా అరణ్య సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే… 

Mumbai Drug Case: కింగ్ ఖాన్‌కు బిగ్ షాక్.. బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేయడంతో.. తీవ్ర నిరాశలో షారుక్ ఖాన్..

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..