Mega 158: చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ అద్దిరిపోయిందిగా
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) ట్రీట్ వచ్చేసింది. అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తోన్న మెగా 158 టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. కొల్లి బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అద్దిరిపోయే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ సినిమా Mega 158 నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స. శనివారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. గతంలో ఊహించినట్లుగానే మెగా 158 సినిమాకు ‘కాకా’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే సందర్భంగా ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న కాకా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఇక సుమారు 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ గ్లింప్స్ లో చిరంజీవి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అలాగే ఈ సినిమాకు బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. . గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడిదే కాంబోలో మరో ప్రాజెక్ట్ వస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. జన నాయకుడు, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.
కాగా ఈ మెగా మూవీ షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణలో దాదాపు సగం భాగం పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే మిగతా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మెగా మూవీని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. మెగాస్టార్ క్రేజ్ కు తగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు బాబీ. ఇక ఈ సినిమా కోసం టాలీవుడ్‌లోని టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, భాను-నందు సంభాషణలు సమకూరుస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్..
Presenting the WHOLE NEW SIDE of MEGASTAR @Kchirutweets Garu on his birthday💥
TITLE GLIMPSE OUT NOW😎 — https://t.co/Qtc0T6fhcC
KAAKA will set THE BLOODY BENCHMARK on the BIG SCREENS this Sankranthi, on JANUARY 13, 2027 🔥#HBDMegastarChiranjeevi
— KVN Productions (@KvnProductions) August 22, 2026
మెగా 158 టైటిల్ గ్లింప్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




