AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో డైరెక్టర్ వశిష్ఠ.. ‘విశ్వంభర’ రిలీజ్‌ గురించి ఏమన్నారంటే?

సుమారు మూడేళ్ల క్రితం 'విశ్వంభర' సినిమా ప్రారంభమైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వశిష్ట. అయితే ఈ మెగా మూవీ అంతకంతకూ లేట్ అవుతోంది. తాజాగా ఇదే విషయంపై స్పందించారు వశిష్ఠ.

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో డైరెక్టర్ వశిష్ఠ.. 'విశ్వంభర' రిలీజ్‌ గురించి ఏమన్నారంటే?
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 22, 2026 | 7:30 AM

Share

ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి కూడా వరుసగా అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా ఒకరోజు మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన చిరంజీవి బర్త్ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులతో పాటు భారీగా అభిమానులు తరలివచ్చారు. డైరెక్టర్ బీవీఎస్ రవి, నిర్మాత బండ్ల గణేష్, హైపర్ ఆది, బిగ్ బాస్ విజేత పవన్ కల్యాణ్ పడాల, డైరెక్టర్లు వశిష్ట, బాబీ, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారీ సీని ప్రముఖులు. కాగా ఇదే కార్యక్రమానికి విశ్వంభర సినిమా డైరెక్టర్ వశిష్ట కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. బాస్ బర్త్ డే అంటేనే మాకు పెద్ద పండగ. ఈ సెలబ్రేషన్స్ లో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలి’ అని చిరంజీవికి విషెస్ చెప్పారు వశిష్ఠ

ఈ క్రమంలోనే అభిమానులు ‘విశ్వంభర’ సినిమా టాపిక్ ను తీసుకురాగావశిష్ఠ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విశ్వంభర.. ఇక్కడున్న చాలా మంది నాపై కోపంగా ఉన్నారు. చాలా మంది తిడుతున్నారు. ఇంకొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ‘రాసిపెట్టుకోండి బల్లగుద్ది చెబుతున్నాను. ‘విశ్వంభర’ లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది’ అని చెప్పుకొచ్చారు వశిష్ఠ. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా సుమారు మూడేళ్ల క్రితం అంటే 2023 ఆగస్టు 22న ‘మెగా 156’ పేరుతో ‘విశ్వంభర’ సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత వెంట వెంటనే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. అయితే టీజర్ లో వాడిన వీఎఎఫ్‌క్స్ పై క్వాలిటీ పరంగా విమర్శలు వచ్చాయి. అంతే అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో డైరెక్టర్ వశిష్ట..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us