Acharya: ఆచార్య సినిమా విడుదల పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..

|

Dec 20, 2021 | 7:57 AM

మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాన పాత్రలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. ఇందులో మెగా పవర్

Acharya: ఆచార్య సినిమా విడుదల పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..
Acharya
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాన పాత్రలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ గత రోజులుగా నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వార్త‌లను నిర్మాత‌లు ఖండించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌రి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే ఆచార్య సినిమా ఉంటుంది’’ అన్నారు. ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే  మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేయనున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..