
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ , టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలనీ చూస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి షూటింగ్ కు బ్రేక్ వేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. అలాగే చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. త్వరలో ఈ సినిమానుంచి మరో పాట విడుదల కాబోతుందని తెలుస్తుంది.
సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 43 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు ‘ఆచార్య’ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇప్పటికే మేకర్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ పాట చిరంజీవి పై చిత్రీకరించిందా లేక చరణ్ పాత్రకు సంబంధించిందా అనేది తెలియాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :