Ram Charan: చెల్లెలు శ్రీజతో ముంబైలో చక్కర్లు కొడుతున్న రామ్ చరణ్… చెర్రి లుక్ ను ప్యాన్స్ ఫిదా..

|

Jan 30, 2022 | 12:23 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ముంబై (Mumbai)లో చక్కర్లు కొడుతుండగా మీడియా కంట పడిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Midea)లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. చరణ్‌ తన చెల్లెలు..

Ram Charan: చెల్లెలు శ్రీజతో ముంబైలో చక్కర్లు కొడుతున్న రామ్ చరణ్... చెర్రి లుక్ ను ప్యాన్స్ ఫిదా..
Ram Charan
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ముంబై (Mumbai)లో చక్కర్లు కొడుతుండగా మీడియా కంట పడిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Midea)లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. చరణ్‌ తన చెల్లెలు శ్రీజతో పాటు పెంపుడు కుక్క రైమ్ లతో ముంబైలో కనిపించారు. సర్వ సాధారణంగా తన పని కోసం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లే రామ్ చరణ్ ఈసారి తన సోదరి శ్రీజతో కనిపించడం అరుదైన దృశ్యం అంటూ ఆ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో రామ్ చరణ్ ఉన్నాడు. చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్‌ ధరించాడు. చరణ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా. దీంతో చెర్రీ న్యూ లుక్ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

అయితే తండ్రి చిరంజీవి కరోనా వైరస్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న నేపధ్యంలో రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై రకరకల వార్తల వినిపిస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయింది అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లకు ఆజ్యం పోసేలా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ నుండి భర్త ఇంటిపేరును తొలగించింది. అయితే ఈ పుకార్లపై శ్రీజ కానీ, మెగా కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ స్పందించలేదు. రామ్ చరణ్ ఎన్టిఆర్ లు నటించిన మెగా మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీ అయ్యాయి, మరోవైపు శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో చెర్రి పాల్గొంటున్నాడు.

 

Also Read:   అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..ఆఫీసులకు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..