Allu Arjun: గంధపు దుంగలు, కేకులు.. దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగొచ్చిన బన్నీకి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..

పుష్ప' (Pushpa) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. సినిమా విడుదలై నెల రోజులు దాటిపోతున్నా నేటికీ ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. డైలాగులే వినిపిస్తున్నాయి

Allu Arjun: గంధపు దుంగలు, కేకులు.. దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగొచ్చిన బన్నీకి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2022 | 12:26 PM

‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. సినిమా విడుదలై నెల రోజులు దాటిపోతున్నా నేటికీ ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. డైలాగులే వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప-2’ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొద్దిగా తీరిక దొరకడంతో దుబాయి వెకేషన్ (Dubai Vacation) కు వెళ్లాడు బన్నీ. సుమారు 16 రోజుల పాటు అక్కడే గడిపాడు. తన టూర్ కు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. కాగా తాజాగా దుబాయి వేకేషన్ ను ముగించుకు వచ్చిన బన్నీకి కూతురు అర్హ అదిరిపోయే వెల్ కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. అందమైన పూలతో `వెల్కమ్ నాన్న` అని ఫ్లోర్ పై వెల్ కమ్ నోటి రాసి  సాదరంగా అతడిని ఇంట్లోకి ఆహ్వానించింది.

‘తగ్గేదేలే’ అంటూ..

ఇక సుమారు రెండు వారాల పాటు ఇంటి భోజనానికి దూరమైన బన్నీ కోసం రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటుచేశారట అతని కుటుంబ సభ్యులు. ఇదంతా పూర్తయ్యాక తన వ్యక్తిగత పనుల కోసం అల్లు అర్జున్ తన కార్యాలయానికి వెళ్లాడట. అక్కడి బృందం కూడా ఈ హీరోకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిందట. ఆఫీస్ మొత్తాన్ని గంధపు దుంగలు, కేకులతో అందంగా అలంకరించారట. వాటిపై ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ను రాసి ఆఫీస్ మొత్తం ‘పుష్ప’ వాతావరణం కనిపించేలా డెకరేట్ చేశారట. కాగా ఆఫీస్ బృందం తనపై కురిపించిన ప్రేమకు బన్నీ పొంగిపోయాడు. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Also Read: Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..

Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..